పిసిడబ్ల్యూ న్యూస్ ప్రత్యేక ప్రతినిధి: పరకాల పట్టణంలో కొందరు వ్యక్తులు విలేకరులుగా జర్నలిజం పేరును దుర్వినియోగం చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉదయం ఇతర ఉద్యోగాలు చేసుకుంటూ, సాయంత్రం విలేకరిగా పరిచయం చేసుకునే వారు వాస్తవంగా ఏ సంస్థకు పనిచేస్తున్నారో స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. ఫైనాన్స్ వ్యవహారాల పేరుతో మోసాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు, పత్రిక పేరు, ఛానల్ పేరు చెప్పి బెదిరింపులకు పాల్పడుతున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి. మరికొందరు విలేకరి ముసుగులో అవినీతి, అక్రమ దందాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ వ్యవహారాలపై సంబంధిత మీడియా సంస్థలు, అధికారులు సమగ్రంగా విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తేవాలని ప్రజలు కోరుతున్నారు. జర్నలిజం పేరును అడ్డుపెట్టుకుని అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా దమ్మున్న పేపరు అని చెప్పి చానల్ అని చెప్పి ఫైనాన్స్ నడుపుతూ అలాగే అవినీతి దందా చేస్తూ విరవిగుతున్నారు. మరి వారిని అధికారులు ఎందుకు గమనించడం లేదు అని పలువురు ప్రజాప్రతినిధులు ప్రశ్నిస్తున్నారు. ఇటీవల ఓ విలేఖరి ఫైనాన్స్ నడుపుతూ చనిపోయిన వ్యక్తికి దాదాపుగా లక్ష రూపాయలు ఇవ్వాలి. కానీ చనిపోయాడు.. మరి ఆ డబ్బులు మరి ఆ విలేకరి ఇచ్చారా లేదా అనేది కూడా ప్రశ్నార్థకంగా మారింది.. ఏది ఏమైనా పరకాల పట్టణంలో విలేకరి ముసుగులో అవినీతి, దందాలు, బెదిరింపులు జరుగుతున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమాజంలో విలేకర్ అంటే గౌరవం ఉంది కొంతమంది విలేకరులు చేపట్టి మిగతా విలేకరులకు చెడ్డ పేరు వస్తుంది. దీనిని గమనించి అధికారులు పరిశీలన చేయాలని మిగతా విలేకరులు అలాగే ప్రజలు కోరుతున్నారు. దీనిపై ఇంటలిజెన్స్, ప్రత్యేక పోలీస్ అధికారులు పరిశీలించి చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
