Saturday, September 5, 2026

పరకాలలో బీఆర్‌ఎస్‌ ధర్నా ఉద్రిక్తం.. పోలీసులతో నాయకుల తోపులాట

పిసిడబ్ల్యూ న్యూస్ ప్రత్యేక ప్రతినిధి: పరకాల అంబేద్కర్ సెంటర్‌లో మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నా ఉద్రిక్తతకు దారితీసింది. ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ బీఆర్‌ఎస్‌వీ నాయకులు చేపట్టిన ఆందోళనకు పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆందోళనకారులు పెద్దఎత్తున నినాదాలు చేస్తూ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ధర్నాను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నించడంతో నాయకులు, పోలీసుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుని తోపులాటకు దారితీసింది. దీంతో అంబేద్కర్ సెంటర్‌లో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

Related Articles

Latest Articles