పరకాల, సెప్టెంబర్ 01: పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్‌రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని కాంగ్రెస్ పార్టీ ముస్లిం మైనార్టీ నాయకుల ఆధ్వర్యంలో మంగళవారం పరకాల బస్టాండ్ సమీపంలోని ఈద్గా మసీదు వద్ద జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పావుశెట్టి సునీల్‌కుమార్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఒంటేరు శ్రావణ్, కౌన్సిలర్లు బండి శ్రీధర్, అల్లే దశరథం, కొయ్యడ శ్రీనివాస్, సుధామల రమేష్, డీసీసీ కార్యదర్శి జాఫర్ రిస్వి, మసీదు కమిటీ అధ్యక్షుడు గౌస్ ఉద్దీన్, కార్యదర్శి బాబా, మైనార్టీ నాయకులు మహమ్మద్ అలీ, హాజీ షఫీ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి ప్రజలకు మరిన్ని సేవలు అందిస్తూ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు కొనసాగాలని నాయకులు ఆకాంక్షించారు.
