పరకాల: పరకాల రెవెన్యూ డివిజనల్ అధికారి అధ్యక్షతన సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పరకాల డివిజన్ స్థాయి అధికారులు, మండల స్థాయి అధికారులు హాజరయ్యారు. ప్రజల నుంచి వివిధ సమస్యలపై మొత్తం 12 అర్జీలను అధికారులు స్వీకరించారు. ప్రజలు సమర్పించిన అర్జీలను సంబంధిత శాఖల అధికారులకు పంపించారు. ఆయా సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించి, నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని రెవెన్యూ డివిజనల్ అధికారి అధికారులను ఆదేశించారు. ప్రజావాణి ద్వారా ప్రజల సమస్యలకు సత్వర పరిష్కారం లభించేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అర్జీల పరిష్కారంలో జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
