పరకాల, ఆగస్టు 17: పరకాల రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయంలో సోమవారం ఓటరు ముసాయిదా జాబితాను రెవెన్యూ డివిజనల్ అధికారి ప్రచురించారు. పరకాల నియోజకవర్గానికి సంబంధించిన ముసాయిదా జాబితా ప్రకారం పురుష ఓటర్లు 98,913 మంది, మహిళా ఓటర్లు 1,04,682 మంది, ఇతరులు ముగ్గురు కలిపి మొత్తం 2,03,598 మంది ఓటర్లు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో డివిజనల్ అడ్మినిస్ట్రేషన్ అధికారి విజయశ్రీ, ఎలక్షన్ సీనియర్ అసిస్టెంట్, ఎలక్షన్ ఆపరేటర్‌తో పాటు రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
