Monday, August 10, 2026

పరకాలలో అసలు ప్రెస్ క్లబ్ ఏది..?

పరకాల పట్టణంలో ప్రెస్ క్లబ్ పేరుతో జరుగుతున్న వ్యవహారాలపై చర్చ మొదలైంది. సుమారు పదేళ్ల క్రితం పరకాలలో ప్రెస్ క్లబ్ ఒక గౌరవప్రదమైన వేదికగా ఉండేది. సీనియర్ పాత్రికేయులను గౌరవిస్తూ, ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడమే ప్రధాన లక్ష్యంగా పనిచేసేది. అయితే ప్రస్తుతం ఆ పరిస్థితులు కనిపించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రెస్ క్లబ్ పేరును కొంతమంది తమ వ్యక్తిగత ప్రయోజనాలు, స్వార్థ ప్రయోజనాల కోసం వినియోగించుకుంటున్నారన్న ఆరోపణలు స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి. అవకాశవాదానికి వేదికగా మార్చి, అసలు జర్నలిజం విలువలను పక్కన పెట్టడం సరికాదని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రెస్ క్లబ్ అనేది ఎవరి వ్యక్తిగత ఆస్తి కాదని, పాత్రికేయులందరికీ సమానంగా ఉండే వేదికగా ఉండాలని ప్రజలు కోరుతున్నారు. నిజమైన పాత్రికేయతను గౌరవించే వారే ఇటువంటి వేదికలకు ప్రాతినిధ్యం వహించాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.పరకాలలో ప్రెస్ క్లబ్ పేరుతో ఎవరు వ్యవహరిస్తున్నారు? దాని వెనుక ఉన్న విధానం ఏమిటి? ఎలాంటి నిబంధనలు, గుర్తింపు ఉన్నాయి? అనే అంశాలను ప్రజలు, ప్రజాప్రతినిధులు గమనించాల్సిన అవసరం ఉంది. ప్రెస్ క్లబ్ పేరును అడ్డుపెట్టుకుని ఎవరైనా వ్యక్తిగత ప్రయోజనాలకు పాల్పడితే అది మొత్తం పాత్రికేయ వృత్తికే మచ్చగా మారుతుందని పలువురు హెచ్చరిస్తున్నారు.

Related Articles

Latest Articles