Friday, October 16, 2026

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలి

మడికొండ, పీసీడబ్ల్యూ న్యూస్: వరంగల్‌–నల్గొండ–ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి రామ్‌రెడ్డి సర్వోత్తమ్‌రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి పిలుపునిచ్చారు. మడికొండలోని సత్యసాయి కన్వెన్షన్‌లో నిర్వహించిన ఎన్నికల సన్నాహక సమావేశంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీతక్క, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్‌రెడ్డి తదితరులతో కలిసి ఆయన పాల్గొన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తూ ప్రతి పట్టభద్ర ఓటరును కలిసి కాంగ్రెస్ అభ్యర్థి విజయానికి కృషి చేయాలని కోరారు.

Related Articles

Latest Articles