Saturday, August 15, 2026

ముదిరాజ్‌వాడలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

పరకాల, ఆగస్టు 15 పిసిడబ్ల్యూ న్యూస్: ముదిరాజ్‌వాడలో ఇండియన్ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో శనివారం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ సిరంగి సంతోష్ కుమార్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం దేశభక్తి నినాదాలతో వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ముదిరాజ్‌వాడ సభ్యులు మాట్లాడుతూ.. గత 30 సంవత్సరాలుగా తమ వాడలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో రావుల స్వామి, మఠం అశోక్, గోనెల నరసింహ, సాదు రమేష్, కేశవైనా అజయ్, ఎండి సిరాజ్, సాదు సురేష్, మడికొండ వంశీ, పల్లె ప్రశాంత్, సాధు శంకర్, బోళ్ల అనిల్, సాదు రాజేష్, మఠం వినయ్, రత్నం రామకృష్ణ, గడ్డం విష్ణు, వీర్ల రాజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Latest Articles