పరకాల: మున్సిపాలిటీ కౌన్సిల్ సమావేశంలో అమర దామం ఉన్న విగ్రహాల మరమ్మతులకు తీర్మానం చేయడాన్ని పట్టణ ప్రజలు స్వాగతిస్తున్నప్పటికీ, కేవలం తీర్మానాలతో సరిపెట్టకుండా పనులను వెంటనే ప్రారంభించి పూర్తి చేయాలని కోరుతున్నారు. ప్రజల భావోద్వేగాలతో ముడిపడి ఉన్న విగ్రహాలు మరమ్మతులు లేక శిథిలావస్థకు చేరుతున్న నేపథ్యంలో అధికారులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కౌన్సిల్లో తీర్మానం చేశామని చెప్పుకోవడం కాకుండా, నిధులు కేటాయించి, పనులకు కార్యాచరణ రూపొందించి, త్వరితగతిన మరమ్మతులు పూర్తి చేయాలని కోరుతున్నారు. ప్రజల డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని అధికారులు ఇకనైనా చర్యలు చేపట్టాలని పట్టణవాసులు స్పష్టం చేస్తున్నారు.
