హనుమకొండ: హనుమకొండలోని అరోరా డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో శనివారం ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.ఈ సందర్భంగా డాక్టర్. సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కళాశాల ప్రిన్సిపాల్ రజిని మాట్లాడుతూ… తల్లిదండ్రుల తర్వాత గురువునే దైవంగా కొలిచే సంస్కృతి మనదని, అందుకే గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వరః, గురు సాక్షాత్ పర బ్రహ్మ తస్మైశ్రీ గురవే నమః అని అంటారని అన్నారు. తల్లిదండ్రులు పిల్లలకు జన్మనిస్తే, గురువు ఆ పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించి వారిని సన్మార్గంలో నడిపించి వారి పురోగతికి బాటలు వేస్తారని ఆమె పేర్కొన్నారు.అనంతరం కేక్ కట్ చేసి, విద్యార్థులు అధ్యాపకులను శాలువాలతో ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో అధ్యాపకులు అశోక్, సతీష్, సంతోష్, రమేష్, సుమలత, జమాల్, ప్రవీణ్, శివకుమార్, రాజ్, విద్యార్థులు పాల్గొన్నారు.
అరోరా కళాశాలలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు
