పరకాల, సెప్టెంబర్ 10 (పీ సి డబ్ల్యూ న్యూస్): పరకాల పోలీస్ స్టేషన్లో సీఐని 22వ వార్డు కౌన్సిలర్ అల్లే దశరథం, 22వ వార్డు అధ్యక్షుడ కేశబోయిన అజయ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఐను శాలువాతో సన్మానించి, గణేష్ ఆగమన్ పోస్టర్ను అందజేసి, ఈ నెల 12న నిర్వహించనున్న గణేష్ ఆగమన్ ఊరేగింపు కార్యక్రమానికి ప్రత్యేకంగా ఆహ్వానించారు.ఈ సందర్భంగా వారాహి యూత్ సభ్యులు మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నట్లుగానే ఈ ఏడాది కూడా గణపతి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. 12వ తేదీన నిర్వహించనున్న గణేష్ ఆగమన్ ఊరేగింపులో భక్తులు, యువత అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో వారాహి యూత్ సభ్యులు పాల్గొన్నారు.
