గోరికొత్తపల్లి, సెప్టెంబర్ 10 (పీసీడబ్ల్యూ న్యూస్): అనారోగ్య కారణాలతో ఇటీవల అకాల మరణం చెందిన బత్తుల శాంతమ్మ (పద్మశాలి) కుటుంబాన్ని పరకాల మున్సిపాలిటీ 9వ వార్డు కౌన్సిలర్ బెజ్జెంకి పూర్ణాచారి గురువారం పరామర్శించారు. గోరికొత్తపల్లి మండల కేంద్రంలోని మృతురాలి నివాసానికి వెళ్లిన ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చి, వారి కుటుంబ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బత్తుల శాంతమ్మ కుటుంబానికి బియ్యం, నిత్యావసర సరుకులను అందజేశారు. కష్టకాలంలో కుటుంబానికి అండగా నిలవడం సామాజిక బాధ్యతగా భావించి తనవంతు సహాయం అందించినట్లు పూర్ణాచారి తెలిపారు. మృతురాలు పరకాల పట్టణానికి చెందిన బత్తుల మల్లేశం, వెంకటేశ్వర్లు, విష్ణుమూర్తిల తల్లి. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులతో పాటు వీర్ల సదానందం, సూదమల్ల రాజయ్య, పొడిచెట్టి సాంబమూర్తి, పప్పుల సుధాకర్, కుమార్ స్వామి, బూర వెంకటేశ్వర్లు, మంత్రి శ్యాం, గంగోజుల విజేందర్ తదితరులు పాల్గొన్నారు.
