Sunday, August 30, 2026

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా తెలుగు భాషా దినోత్సవం

పరకాల: స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గిడుగు రామ్మూర్తి పంతులు జయంతిని పురస్కరించుకుని తెలుగు విభాగం, జాతీయ సేవా పథకం (ఎన్‌ఎస్‌ఎస్‌) ఆధ్వర్యంలో శనివారం తెలుగు భాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కళాశాల వైస్‌ ప్రిన్సిపల్‌ ప్రొఫెసర్‌ ఎన్‌. మల్లయ్య హాజరై మాట్లాడారు. తెలుగు భాష గొప్పతనం, మాధుర్యాన్ని వివరించారు. వ్యవహారిక భాష అభివృద్ధికి గిడుగు రామ్మూర్తి పంతులు చేసిన సేవలను విద్యార్థులకు వివరించారు. మాతృభాషను ప్రతి ఒక్కరూ కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు. తెలుగు విభాగాధిపతి రేణ ఈశ్వరయ్య మాట్లాడుతూ మాతృభాష ద్వారానే సృజనాత్మకత అభివృద్ధి చెందుతుందని అన్నారు. పరభాషలను నేర్చుకోవడంలో తప్పులేదని, అయితే మాతృభాషను విస్మరించరాదని సూచించారు. యువత సాహిత్యంపై మక్కువ పెంచుకోవాలని పిలుపునిచ్చారు. ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రాం ఆఫీసర్‌ డాక్టర్‌ అన్నెపు శ్రీనివాస్‌రెడ్డి, స్టాఫ్‌ క్లబ్‌ సెక్రటరీ డాక్టర్‌ ఎలిశాల అశోక్‌, ఐక్యూఏసీ కోఆర్డినేటర్‌ డాక్టర్‌ జి. రామకృష్ణ, డాక్టర్‌ డి. సంజయ్‌కుమార్‌ తదితరులు ప్రసంగించారు. కార్యక్రమంలో అధ్యాపకులు, విద్యార్థినీ విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Related Articles

Latest Articles