పరకాల, ఆగస్టు 22 (పిసిడబ్ల్యూ న్యూస్): పరకాల పట్టణంలోని జయ డీలక్స్ రోడ్డులో మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలను అభిమానులు ఘనంగా నిర్వహించారు. చిరంజీవి అభిమాన సంఘం నియోజకవర్గ అధ్యక్షుడు బొచ్చు భాస్కర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మడికొండ శీను ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అభిమానులు కేక్ కట్ చేసి చిరంజీవికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా బొచ్చు భాస్కర్ మాట్లాడుతూ.. గత కొన్ని సంవత్సరాలుగా చిరంజీవి జన్మదిన వేడుకలను నిరంతరం నిర్వహిస్తున్నామని తెలిపారు. చిరంజీవి కేవలం సినిమాల్లోనే కాకుండా సమాజ సేవలోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారని అన్నారు. నేత్రదానం, రక్తదానం వంటి సేవా కార్యక్రమాలకు చిరంజీవి ఇచ్చిన ప్రాధాన్యమే తమను ఆయన అభిమానులుగా మార్చిందని పేర్కొన్నారు. చిరంజీవి సేవా స్ఫూర్తిని కొనసాగిస్తూ భవిష్యత్తులోనూ అభిమాన సంఘం ఆధ్వర్యంలో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని బొచ్చు భాస్కర్ తెలిపారు. అభిమానులు బ్రెడ్డు పండ్లు పేదవారికి, వృద్ధులకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో చిరంజీవి అభిమానులు బోచ్చు రవికుమార్, బొచ్చు మహేష్, మేకల దిలీప్, ఒంటేరు రాజు, దొమ్మటి శ్రీను యువకులు తదితరులు పాల్గొన్నారు.
