Wednesday, August 19, 2026

పరకాలలో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలు

పరకాల: ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని పరకాల డివిజన్‌కు చెందిన ఫోటోగ్రాఫర్లు బుధవారం ప్రత్యేక వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఫోటోగ్రాఫర్ల ఐక్యతకు ప్రతీకగా ప్రత్యేక జెండాను ఆవిష్కరించారు. సీనియర్, జూనియర్ ఫోటోగ్రాఫర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని పరస్పర ఐక్యతను చాటుకున్నారు. ప్రతి ఏటా ఆగస్టు 19న ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు ఫోటోగ్రాఫర్లు తెలిపారు. 1839లో ఫ్రాన్స్ ప్రభుత్వం ‘డాగ్యురోటైప్’ అనే తొలి ఫోటోగ్రఫీ ప్రక్రియను ప్రపంచానికి ఉచితంగా అందించిన సందర్భంగా ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నట్లు వివరించారు. ఫోటోగ్రఫీ రంగాన్ని నమ్ముకుని జీవిస్తున్న కుటుంబాల సంక్షేమం కోసం ప్రతి ఒక్కరూ పరస్పరం అండగా నిలవాలని పిలుపునిచ్చారు. చరిత్ర, స్థానిక సంస్కృతి, ప్రజల జీవన విధానం, మానవ భావోద్వేగాలను చిత్రాల రూపంలో భవిష్యత్ తరాలకు అందించడంలో ఫోటోగ్రాఫర్ల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. కార్యక్రమంలో పరకాల డివిజన్‌కు చెందిన పలువురు ఫోటోగ్రాఫర్లు పాల్గొన్నారు.

Related Articles

Latest Articles