Monday, July 27, 2026

పరకాలలో కార్గో సేవలు బంద్… ప్రజలకు శాపమా? అధికారులకు పట్టదా?

పిసీడబ్ల్యూ న్యూస్ ప్రత్యేక ప్రతినిధి: పరకాల వంటి కీలక నియోజకవర్గంలో దాదాపు ఏడాదిన్నరగా కార్గో సేవలు నిలిచిపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. చిన్న వ్యాపారులు, విద్యార్థులు, రైతులు, సాధారణ ప్రజలు అత్యవసర పార్శిళ్లు పంపాలంటే వరంగల్, హనుమకొండ వంటి ప్రాంతాలకు వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. ప్రజా అవసరాలకు సంబంధించిన కీలక సేవలు నిలిచిపోయినా సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించకపోవడం విచారకరం. కార్గో సేవలు ఎందుకు నిలిచిపోయాయి? వాటి పునరుద్ధరణకు ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకున్నారు? అనే ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. వెంటనే కార్గో సేవలను పునరుద్ధరించి ప్రజల ఇబ్బందులకు ముగింపు పలకాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. లేదంటే ప్రజల ఆందోళనలు మరింత ఉధృతమయ్యే అవకాశం ఉంది.

Related Articles

Latest Articles