పరకాల పట్టణంలోని జయ డీలక్స్ రోడ్డులో ఉన్న ఆర్కే సీడ్స్ అండ్ పెస్టిసైడ్స్ దుకాణంలో ఈ నెల డీఎస్పీఎల్ కంపెనీకి చెందిన దామిని–541 మిరప విత్తనాలను కొనుగోలు చేసిన కొంతమంది రైతులు, విత్తనాలు ఇంకా మొలకెత్తకపోవడంతో ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంపై దుకాణ యజమాని తాళ్లపల్లి రాజు స్పందిస్తూ రైతులు ఎలాంటి అపోహలకు గురికావద్దని కోరారు. వాతావరణ పరిస్థితులు, నేల తేమ తదితర కారణాల వల్ల మొలకలో స్వల్ప ఆలస్యం జరిగే అవకాశం ఉందని తెలిపారు. మరో పది రోజుల్లో విత్తనాలు పూర్తిస్థాయిలో మొలకెత్తే అవకాశముందని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
