Friday, July 17, 2026

హెడ్ కానిస్టేబుల్ నాగేల్లి సుజాతను అభినందించిన సీఐ

పరకాల: తెలంగాణ ఐదవ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ లో నాలుగు పథకాలు సాధించిన పరకాల పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ నాగేల్లి సుజాతను పరకాల పోలీస్ సిఐ వి క్రాంతి కుమార్ అభినందించారు. తెలంగాణ ఐదవ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ మల్కాజిగిరి హైదరాబాద్ లో 7 -7 -2026 నుండి 9 -7 -2026 జరిగిన పోటీలలో పరకాల పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ నాగేల్లి సుజాత పోటీలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హెడ్ కానిస్టేబుల్ సుజాత నాలుగు పథకాలు పవర్ లిఫ్టింగ్ లో గోల్డ్ మెడల్, వెయిట్ లిఫ్టింగ్ లో సిల్వర్ మెడల్, బాక్సింగ్ లో బ్రాంజ్ మెడల్, యుషు గేమ్ లో సిల్వర్ మెడల్ సాధించారు. పరకాల పోలీస్ స్టేషన్లో సీఐ వి క్రాంతి కుమార్ హెడ్ కానిస్టేబుల్ సుజాతను అభినందించారు. ఈ కార్యక్రమంలో పరకాల పోలీస్ స్టేషన్ ఏఎస్ఐ రమేష్, హెడ్ కానిస్టేబుల్ టి సర్వన్, కానిస్టేబుల్ రాజయ్య, మహిళా కానిస్టేబుల్ శ్రీలత తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Latest Articles