పిసిడబ్ల్యూ న్యూస్ ప్రత్యేక ప్రతినిధి: పరకాల ప్రాంత ప్రజలకు, చిన్న వ్యాపారులకు, విద్యార్థులకు, రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉన్న కార్గో సేవలు కొంతకాలంగా నిలిచిపోవడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోందని సోషల్ వర్కర్ జనగాం సంతోష్, కరాటే మాస్టర్ రావుల స్వామి పేర్కొన్నారు. గతంలో పరకాల నుంచి వివిధ ప్రాంతాలకు పార్సిళ్లు, వ్యవసాయ ఉత్పత్తులు, ఇతర వస్తువులు సులభంగా రవాణా అయ్యేవని, ప్రస్తుతం ఆ సేవలు నిలిచిపోవడంతో ప్రజలు అదనపు ఖర్చు, సమయ నష్టాన్ని ఎదుర్కొంటున్నారని తెలిపారు. కార్గో సేవలు నిలిచిపోవడానికి గల అసలు కారణాలను సంబంధిత అధికారులు ప్రజలకు వెల్లడించాలని వారు డిమాండ్ చేశారు. స్థానికంగా వినిపిస్తున్న ఆరోపణల ప్రకారం డిపో మేనేజర్ నిర్లక్ష్యం, సమన్వయ లోపం, సరైన చర్యలు తీసుకోకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని పేర్కొన్నారు. ఈ ఆరోపణలపై ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను బయటపెట్టాలని కోరారు. ప్రజలకు అవసరమైన సేవలను నిరంతరం అందించడం ప్రభుత్వ సంస్థల బాధ్యత అని, కార్గో సేవలు లేకపోవడంతో చిన్న వ్యాపారులు, ఆన్‌లైన్ వ్యాపారులు, రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఒకప్పుడు పరకాల నుంచి సులభంగా జరిగే పార్సిల్ రవాణా ఇప్పుడు ఇతర పట్టణాలపై ఆధారపడాల్సిన పరిస్థితి రావడం బాధాకరమని అన్నారు. కార్గో సేవలను తక్షణమే పునరుద్ధరించేందుకు సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని, డిపో నిర్వహణలో లోపాలు ఉన్నట్లయితే బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని సేవలను త్వరగా ప్రారంభించకపోతే ప్రజా సంఘాలతో కలిసి ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ అంశంపై పిసిడబ్ల్యూ న్యూస్ ప్రత్యేక ప్రతినిధి పరకాల డిఎం కి ఫోన్ చేయగ సరైన సమాధానం చెప్పలేదు. అని ఈ సందర్భంగా వారు తెలియజేశారు. విషయాన్ని పరకాల ప్రాంత ప్రజలు గమనించగలరు. అని కోరారు.
