మానేరు ఇసుక మాఫియాపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రాస్తారోకో
తెలంగాణ / పెద్దపల్లి.సుల్తానాబాద్: పిసి డబ్ల్యూ న్యూస్ ప్రతినిధి:
పెద్దపల్లి నియోజకవర్గ కమిటీ ఆధ్వర్యంలో మానేరు ఇసుక మాఫియాలపై చర్యలు తీసుకోవాలని సుల్తానాబాద్ లో రాస్తరోకో చేశారు. ఈ సందర్భంగా పెద్దపల్లి నియోజకవర్గ ఇన్చార్జ్ దాసరి ఉష మాట్లాడుతూ మానేరు వాగులోనీ చెక్ డ్యాములు వున్నట్టు తప్పుడు నివేదికలు సమర్పించి నీటి లభ్యత లేనట్టుగా లెక్కలు చూపిస్తు ఆక్రమంగా తరలిస్తున్న ఇసుకను వెంటనే నిలిపివేయాలని, అదేవిధంగా ఇసుక లారీ రవాణా వలన రహదారి పూర్తిగా ధ్వంసమై రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, ప్రయాణికునికులు తీవ్ర అస్వస్థతకు గురవుతున్నారనీ రోడ్డుకు ఇరువైపులా వ్యాపారస్తులు దుమ్ముకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనీ దీనికి తక్షణమే చర్యలు తీసుకోవాలని బహుజన్ సమాజ్ పార్టీ తరఫున డిమాండ్ చేయడం చేశారు. ఈ కార్యక్రమంలో బహుజన్ సమాజ్ పార్టీ పెద్దపల్లి నియోజకవర్గ అధ్యక్షులు బొంకురి సాగర్, కోశాధికారి తోట వెంకటేష్ పటేల్, మండల అధ్యక్షులు బోయిని రంజిత్, కనుకుల సెక్టర్ అధ్యక్షులు నరసయ్య, రాములు, స్థానిక వ్యాపారస్తులు, తదితరులు పాల్గొన్నారు.