Saturday, March 7, 2026

సహచర విద్యార్థిని కుటుంబానికి తోటి విద్యార్థి బృందం ఆర్థిక చేయూత

మొగుళ్ళపల్లి: మొగుళ్లపల్లి మండలం రంగాపురం గ్రామానికి చెందిన 2004-05 సంవత్సరంలో పదో తరగతి బ్యాచ్‌కు చెందిన తమ సహచర విద్యార్థిని(మిత్రురాలు) తూముల కవిత భర్త రమేష్ గుండెపోటుతో మృతి చెందగా ఆమె కుటుంబానికి ఆదరణ లేక ఇద్దరి ఆడ పిల్లలను పెంచి పోషించే స్థోమత లేని దీన పరిస్థితిని చూసి మానవత ధృక్పతంతో ఆమెతో కలిసి చదువుకున్న పదో తరగతి మిత్రులు టేకుమట్ల మండలం రాఘవరెడ్డిపేటలో ఉన్న ఆమెకు పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతి తెలుపడంతోపాటు ఆర్థిక చేయూతనందించాలనే ఆలోచనతో తమ వంత సహయంగా రూ.30,000 ఆర్థిక సాయాన్ని చెక్కు రూపంలో అందించారు. ఆమెకు అండగా నిలిచి మనోధైర్యాన్ని నింపారు. తమ వంతు సహాయ సహకారాలు ఎల్ల వేళలు ఉంటాయని ధీమా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైనాల మహేందర్, ముష్క రాజ్‌కుమార్, అచ్చ మహేందర్, చిక్కుల ప్రమోద్, మ్యదరి రాజేందర్, పావుశెట్టి అశోక్, అచ్చ రాజయ్య తదితర మిత్రులు పాల్గొన్నారు.

Related Articles

Latest Articles