పరకాల బస్టాండ్‌లో దాదాపు గంట సమయం గడుస్తున్నా ఒక్క బస్సు కూడా రాకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రయాణికుల ఇబ్బందులు ఆర్టీసీ అధికారులకు కనిపించడం లేదా? బస్సుల రాకపోకలను క్రమబద్ధీకరించి తక్షణమే సమస్య పరిష్కరించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
