Monday, November 23, 2026

పోలియో రహిత సమాజ నిర్మాణమే లక్ష్యం

పరకాల: పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అలియాబాద్ గ్రామ సర్పంచ్ శాతరాశి సనత్ కుమార్ పటేల్ పిలుపునిచ్చారు. ఆదివారం పోలియో దినోత్సవం సందర్భంగా పరకాల మండలం అలియాబాద్ గ్రామంలో వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో చిన్నారులకు ఆయన పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించి, వ్యాధి నిర్మూలనలో భాగస్వాములు కావాలని కోరారు. గ్రామంలో పోలియో చుక్కల కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తున్న వైద్య సిబ్బంది సేవలను ఆయన అభినందించారు.

Related Articles

Latest Articles