ఆత్మకూర్ మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ మండల మైనార్టీ సెల్ అధ్యక్షులు ఎండి ఖాజా,కాంగ్రేస్ యూత్ నాయకులు ఎండి మొయిన్,పల్లం రాజేష్ ఆ పార్టీకి రాజీనామా చేస్తూ పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ లో చేరారు.వారికి గులాబీ కండువా కప్పి సాదరంగా చల్లా ధర్మారెడ్డి పార్టీలోకి ఆహ్వానించారు.పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి సముచిత స్థానం కల్పిస్తామని మాజీ ఎమ్మెల్యే తెలిపారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు పాపాని రవీందర్,రేవూరి సుధాకర్ రెడ్డి, వంగాల భగవాన్ రెడ్డి,రేవూరి శ్యాంసుందర్ రెడ్డి,నత్తి కర్ణాకర్ తదితరులు పాల్గొన్నారు.
