పరకాల పట్టణంలోని వెల్లంపల్లి రోడ్డులో పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా 4.5 గ్రాముల ఎండు గంజాయి పట్టుబడింది. పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించిన వలిగె రాజేష్ (30)ను ఎస్‌ఐ ఆర్. రణధీర్ సిబ్బందితో కలిసి పట్టుకున్నారు. స్కూటీ డిక్కీలో గంజాయి గుర్తించి, స్కూటీ, మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. నాగ్‌పూర్‌కు చెందిన గంజాయి సరఫరాదారుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. NDPS చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
