పరకాల: స్థానిక ఏరియా ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలు, రోగులకు కల్పిస్తున్న సదుపాయాలు, ఆసుపత్రి నిర్వహణ తీరును ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ పరిశీలించారు. ఈ సందర్భంగా వైద్యులతో మాట్లాడి చికిత్స వివరాలు తెలుసుకున్నారు. రోగులకు మెరుగైన వైద్యం అందించాలని, వైద్య సేవల్లో నిర్లక్ష్యం వహించరాదని సూచించారు.
