Tuesday, November 10, 2026

బీఆర్ఎస్‌లో మళ్లీ వర్గపోరు.. పోచంపల్లి ఫౌండేషన్ ఫ్లెక్సీల తొలగింపు!

పరకాల: పరకాల పట్టణంలో బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి బయటపడ్డాయి. పోచంపల్లి ఫౌండేషన్‌కు సంబంధించిన ఫ్లెక్సీలను బీఆర్ఎస్ నాయకులు తొలగించడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే పోచంపల్లి, మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, నాగూర్ల వర్గాలుగా కొనసాగుతున్న విభేదాలు తాజా పరిణామంతో మరింత రచ్చకెక్కినట్లు కనిపిస్తోంది. పార్టీలో ఐక్యత లేకపోవడం, నాయకుల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతుండటమే పరకాల నియోజకవర్గంలో బీఆర్ఎస్ వెనుకంజకు కారణమా? అనే చర్చ ప్రజల్లో మొదలైంది. నాయకుల మధ్య సమన్వయం లేకపోతే కేడర్ పరిస్థితి ఏమిటన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అసలు ఈ వర్గపోరుకు బాధ్యులెవరు? పార్టీని గాడిలో పెట్టేదెవరు? అనే ప్రశ్నలు పరకాల పట్టణ ప్రజల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఇప్పటికైనా అధిష్ఠానం జోక్యం చేసుకుని విభేదాలకు ఫుల్‌స్టాప్ పెడుతుందా? వేచి చూడాలి.

Related Articles

Latest Articles