పరకాల: కాంగ్రెస్ పార్టీ పరకాల మండల శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఎమ్మెల్యే రేవురి ప్రకాశ్ రెడ్డి ఆదేశాల మేరకు బీఎల్ఏల దంపతులకు నూతన వస్త్రాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు చందు, కట్కూరి దేవేందర్ రెడ్డి, రాజిరెడ్డితో పాటు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
