పరకాల, నవంబర్ 4 (పిసిడబ్ల్యూ న్యూస్): దీపావళి పండుగ సందర్భంగా పరకాల ఫైర్ స్టేషన్ ఆఫీసర్ భద్రయ్య ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అగ్నిప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. టపాసులు కాల్చేటప్పుడు తగిన జాగ్రత్తలు పాటించాలని, నిర్లక్ష్యంతో ప్రమాదాల బారిన పడవద్దని భద్రయ్య విద్యార్థులకు సూచించారు. తల్లిదండ్రుల పర్యవేక్షణలోనే టపాసులు కాల్చాలని, ప్రమాదాల నివారణకు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.
