Thursday, November 5, 2026

పట్టభద్రుల ఓటరు నమోదుకు నేడే చివరి గడువు

పరకాల: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు జాబితాలో అర్హులైన ప్రతి పట్టభద్రుడు తమ పేరును తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని పరకాల మండల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ ఇన్‌చార్జి, అలియాబాద్ గ్రామ సర్పంచ్ శాతరాశి సనత్ కుమార్ పటేల్ కోరారు. చల్లా ధర్మారెడ్డి ఆదేశాల మేరకు పరకాల మండలం పోచారం గ్రామంలో పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సనత్ కుమార్ పటేల్ మాట్లాడుతూ.. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదుకు నవంబర్ 6, 2026 చివరి తేదీ అని తెలిపారు. అర్హులైన పట్టభద్రులు ఫారం–18 ద్వారా ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. పరకాల ఆర్డీవో, తహసీల్దార్, ఎంపీడీవో, మున్సిపాలిటీ, మండల విద్యాశాఖ అధికారి కార్యాలయాల్లో దరఖాస్తు ఫారాలు అందుబాటులో ఉన్నాయని వివరించారు. అలాగే స్థానిక బీఆర్ఎస్ నాయకులను సంప్రదించి ఓటరు నమోదు ప్రక్రియపై వివరాలు తెలుసుకోవచ్చన్నారు. అర్హులైన ప్రతి పట్టభద్రుడు చివరి తేదీలోగా దరఖాస్తు చేసుకుని ఎమ్మెల్సీ ఓటరు జాబితాలో తమ పేర్లు నమోదు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పోచారం గ్రామ ఇన్‌చార్జి నరేష్ కుమార్, క్లస్టర్ ఇన్‌చార్జి సురేష్‌తో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

Related Articles

Latest Articles