Sunday, November 8, 2026

గ్యాస్ గోదాముకు సమీపంలో ఫైర్‌వర్క్స్ షాప్‌.. ప్రమాదం జరిగితే బాధ్యులెవరు?

పరకాల: గ్యాస్ గోదాముకు అర కిలోమీటరు దూరం కూడా లేని ప్రాంతంలో ఫైర్‌వర్క్స్ షాప్‌ నిర్వహిస్తుండటంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. షాప్‌కు అన్ని అనుమతులు ఉన్నాయంటూ యజమాని ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ, జనావాసాల మధ్య బాణసంచా విక్రయాలు నిర్వహించడం భద్రతాపరమైన ప్రశ్నలను లేవనెత్తుతోంది. సమీపంలో గ్యాస్ గోదాము ఉండటంతో ఏదైనా అగ్నిప్రమాదం జరిగితే పరిస్థితి తీవ్రంగా మారే ప్రమాదం ఉందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. తక్షణమే ఆర్డీఓ, పోలీస్, ఫైర్‌స్టేషన్ అధికారులు స్పందించి అనుమతులు, భద్రతా ప్రమాణాలపై క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపట్టాలని, నిబంధనలకు విరుద్ధంగా ఉంటే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత స్పందించడం కంటే ముందే అప్రమత్తం కావాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

Related Articles

Latest Articles