Sunday, November 8, 2026

దీపావళి పండుగను సంతోషంగా జరుపుకోవాలి

పరకాల: పట్టణ ప్రజలందరూ దీపావళి పండుగను కుటుంబ సభ్యులతో కలిసి ఆనందోత్సాహాల మధ్య ఘనంగా జరుపుకోవాలని పరకాల పట్టణ పద్మశాలి సేవా సంఘం యూత్ అధ్యక్షుడు, తెలంగాణ బెల్లం చాయ్ యజమాని దాసరి రవి ఆకాంక్షించారు. టపాసులు కాల్చే సమయంలో తగిన జాగ్రత్తలు పాటిస్తూ ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలని కోరారు. ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో పండుగ జరుపుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు. దీపావళి చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక. చీకటిని తొలగించి వెలుగులు నింపే ఈ పర్వదినం ప్రతి ఒక్కరి జీవితాల్లో సంతోషం, శాంతి, శ్రేయస్సును తీసుకురావాలని ఆయన కోరారు.

Related Articles

Latest Articles