Wednesday, October 28, 2026

కల్తీ విత్తనాలతో రైతులకు నష్టం? ఫర్టిలైజర్ షాప్ ముందు రైతుల ఆందోళన!

పరకాల పట్టణంలోని ఓ ప్రముఖ ఫర్టిలైజర్ దుకాణం వద్ద జోగంపల్లి, మైలారం, పెద్దకోడెపాక గ్రామాలకు చెందిన రైతులు ఆందోళనకు దిగారు. ఐదు నెలల క్రితం సాగు చేసిన మంగళ సీడ్, సిద్ధి 44 వరి విత్తనాలతో ఆశించిన ఫలితం రాలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని, సమస్య పరిష్కారమయ్యే వరకు వెనక్కి తగ్గేది లేదని హెచ్చరించారు. విత్తనాల నాణ్యతపై అధికారులు విచారణ జరిపి, నష్టపోయిన రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

Related Articles

Latest Articles