Tuesday, October 27, 2026

పరకాలలో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు

పరకాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ‘సమాజంలో పోలీసుల పాత్ర’ అనే అంశంపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు. పరకాల సీఐ ఏ. ప్రవీణ్ కుమార్ ముఖ్యఅతిథిగా పాల్గొని, విద్యార్థులు స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకొని ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని సూచించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ బి. సంతోష్ కుమార్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Related Articles

Latest Articles