పరకాల, అక్టోబర్ 25 (పిసిడబ్ల్యూ న్యూస్): నాగారం గ్రామంలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్న బొమ్మరాజు అఖిల (20) ఇంట్లో ఉరివేసుకుని మృతి చెందింది. కుమార్తె మరణంపై అనుమానం వ్యక్తం చేస్తూ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నెల 24న కూలీ పనులకు వెళ్లిన తండ్రికి సాయంత్రం 6.25 గంటలకు అఖిల ఫోన్ చేసి ఇంటికి రావాలని కోరింది. రాత్రి 8.45 గంటలకు ఇంటికి చేరుకున్న ఆయనకు గేటుకు తాళం వేసి కనిపించింది. ఇంటి వెనుక నుంచి లోపలికి వెళ్లి చూడగా అఖిల ఉరివేసుకుని కనిపించింది. వెంటనే కిందకు దించినప్పటికీ అప్పటికే మృతి చెందింది. ఘటనపై ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసి, కాల్‌డేటా సేకరిస్తూ దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
