Friday, September 11, 2026

సీఐని మర్యాదపూర్వకంగా కలిసి గణేష్ ఆగమన్‌కు ఆహ్వానం

పరకాల, సెప్టెంబర్ 10 (పీ సి డబ్ల్యూ న్యూస్): పరకాల పోలీస్ స్టేషన్‌లో సీఐని 22వ వార్డు కౌన్సిలర్ అల్లే దశరథం, 22వ వార్డు అధ్యక్షుడ కేశబోయిన అజయ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఐను శాలువాతో సన్మానించి, గణేష్ ఆగమన్ పోస్టర్‌ను అందజేసి, ఈ నెల 12న నిర్వహించనున్న గణేష్ ఆగమన్ ఊరేగింపు కార్యక్రమానికి ప్రత్యేకంగా ఆహ్వానించారు.ఈ సందర్భంగా వారాహి యూత్ సభ్యులు మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నట్లుగానే ఈ ఏడాది కూడా గణపతి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. 12వ తేదీన నిర్వహించనున్న గణేష్ ఆగమన్ ఊరేగింపులో భక్తులు, యువత అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో వారాహి యూత్ సభ్యులు పాల్గొన్నారు.

Related Articles

Latest Articles