Thursday, July 30, 2026

మొక్కల పెంపకంతోనే మానవ మనుగడ: సర్పంచ్ శ్రీవాణి

మొగుళ్లపల్లి: ముల్కలపల్లి గ్రామంలో హరితహారం కార్యక్రమం సందర్భంగా రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటి, ఇంటింటికి ఐదు మొక్కలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గ్రామ సర్పంచ్ నాంపల్లి శ్రీవాణి–రమేష్ దంపతులు మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. చెట్ల నరికివేత వల్ల కాలుష్యం పెరిగి ఓజోన్ పొర దెబ్బతింటోందని, దీంతో మానవాళితో పాటు సమస్త జీవరాశుల మనుగడకూ ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందన్నారు. మొక్కల పెంపకం ద్వారానే స్వచ్ఛమైన వాతావరణం, భావితరాలకు సురక్షిత భవిష్యత్ అందించవచ్చని పేర్కొన్నారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు, గ్రామపంచాయతీ పాలకవర్గం, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Related Articles

Latest Articles