ఖానాపూరం, జనవరి15 (పీసీడబ్ల్యూ న్యూస్ ): సంక్రాంతి సంబరాల్లో భాగం వేప చెట్టు తండా గ్రామపంచాయతీలో క్రికెట్ టోర్నమెంట్ మాజీ సర్పంచ్ పద్మావతి వెంకన్న ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఆనవాయితీగా గత ఐదు సంవత్సరాల నుండి నిర్వహించబడుతున్న ఆటల పోటీల్లో భాగంగా కోమటిపల్లి తండా రేవతుండా వేపచెట్టు తండా మూడు దండాలను కలిపి నాలుగు టీములుగా ఏర్పడి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. ప్రథమ బహుమతి వేప చెట్టు తండా ద్వితీయ బహుమతి కోమటిపల్లి తండా నిలవడం జరిగింది. పండగ వాతావరణం లో మూడు తండల ప్రజలు యువకులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసినారు ప్రథమ బహుమతి ఒక వెయ్యి నూట పదహారు రూపాయలు కార్యక్రమ నిర్వాహకులు భూక్య పద్మావతి వెంకన్న మాజీ సర్పంచ్ ద్వితీయ బహుమతి తెజవత్ రెడ్డి నాయక్ 500 16 రూపాయలు ప్రైజ్ మనీ గా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పిటిసి గుగులోతు బాలు నాయక్ బిఆర్ఎస్ గ్రామ పార్టీ బాధ్యులు హేమ రాజు సుమన్ లక్ష్మణ్ సంతోష్ విజయ్ బాలాజీ సురేందర్ తేజావత్ బద్రు తేజావత్ శ్రీను ప్రసాద్ వెంకన్న బెజవాడ గోవిందు నాయక్ మరియు గుగులోతు సంతోష్ వెంకన్న గూగుల్ వద్దు జీవన్ కొమ్మలు మరియు యూత్ సభ్యులు పాల్గొని విజయవంతం చేసినారు.