Tuesday, July 21, 2026

పరకాల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ పరీక్షలు ప్రారంభం

పరకాల పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు నుంచే విద్యార్థులు భారీ సంఖ్యలో హాజరై పరీక్షలను ధైర్యంగా రాస్తుండటం విశేషం. కళాశాల ప్రాంగణం ఉదయం నుంచే విద్యార్థులతో నిండిపోయింది. పరీక్షా కేంద్రంలో నిబంధనలు అమలు చేయడంతో పాటు, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. హాల్ టికెట్లు, ఐడీ కార్డులు పరిశీలించిన అనంతరం విద్యార్థులను హాలుల్లోకి అనుమతించారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో పరీక్షలు నిర్వహించబడుతున్నాయి. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తాగునీరు, వైద్య సదుపాయాలు ఏర్పాటు చేశారు. పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు కళాశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు మరియు సిబ్బంది సమన్వయంతో పనిచేస్తున్నారు. పరీక్షా కేంద్రం వద్ద పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు.

 

 

Related Articles

Latest Articles