Wednesday, January 22, 2025

ప్రభుత్వ కళాశాలలో సంక్రాంతి రంగవల్లుల పోటీలు. మాజీ ఎంపిపి కందగట్ల కళావతి-నరహరి

సంగెం.జనవరి10 (పిసిడబ్ల్యూ న్యూస్): తెలుగు రాష్ట్రాలలోముగ్గుల పోటీలు సాంప్రదాయాలకు ప్రతీకలు అని,మాజీ ఎంపిపి కందగట్ల కళావతి – నరహరి అన్నారు. శుక్రవారం రోజున ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సంక్రాంతి సంబరాలు ప్రిన్సిపాల్ కాక మాధవరావు ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నిర్వహించిన రంగవల్లుల పోటీలు విద్యార్థులలో ఎంతగానో ఆసక్తిని రేకెతించాయి. విద్యార్థులు తమ సృజనాత్మకతను ప్రదర్శిస్తూ అద్భుతమైన రంగవల్లులను రూపొందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా సంగెం మాజీ ఎంపిపి కళావతి హాజరై ప్రధమ, ద్వితీయ, తృతీయ, ప్రత్యేక బహుమతులను ప్రకటించి అందజేశారు. సాంప్రదాయ కళలు, సాంస్కృతిక విలువలు,ప్రస్తుతం జరుగుతున్న సంఘటనలు ఇలా అనేక అంశాలను ఆధారంగా చేసుకుని రంగవల్లులు రూపొందించారు. ఈ పోటీల్లో విద్యార్థులు తమ మిత్రులతో కలిసి పనిచేస్తూ జట్టుగా పోటీ పడ్డారు. ఇది వారిలో సహకార స్ఫూర్తిని పెంపొందిస్తుంది అని, కళాశాల ప్రిన్సిపాల్ కాక మాధవరావు పేర్కొన్నారు. ఈ పోటీల ద్వారా విద్యార్థులలో కళాత్మక నైపుణ్యాలు పెరుగుతాయని, సామాజిక స్పృహ పెరుగుతుందని, కళాశాల సీనియర్ అధ్యాపకురాలు బండి విజయ నిర్మల విద్యార్థులను ఉద్దేశించి కొనియాడారు.ఈ కార్యక్రమంలో కళాశాల గ్రంధపాలకులు రాజ్ కుమార్, సీనియర్ అసిస్టెంట్ సుధీర్ కుమార్, అధ్యాపకులు బుచ్చిరెడ్డి, అనిల్ కుమార్, పవన్ కుమార్, కుమారస్వామి, యాకసాయిలు, రాఖీ, కుమారస్వామి చిరంజీవి, మాధవి, అక్రమ్ అలీ, పద్మ, రమాదేవి, నదయ్య, శివ, లక్ష్మి, సంగీత, విద్యార్తిని విద్యార్థులు పాల్గొన్నారు.

Related Articles

Stay Connected

87,567FansLike
85,687FollowersFollow
66,686SubscribersSubscribe

Latest Articles