సిరోలు డిసెంబర్ 31 (పి సి డబ్ల్యూ న్యూస్): మండల ప్రజలకు నూతన సంవత్సర వేడుకలను ప్రజలందరూ సంతోషంగా ప్రశాంత వాతావరణములో జరుపుకోవాలని సీరోల్ ఎస్ ఐ నాగేష్ కోరారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ డిసెంబర్31 నా రాత్రి సిరోల్ మండల పరిధిలో విస్తృతంగా తనిఖీలు నిర్మిస్తామన్నారు. ప్రభుత్వానిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు నమోదు తప్పక చేస్తామన్నారు. బ్రిత్ అనలైజర్లలో తనిఖీలు మద్యం సేవించి వాహనాలు నడిపితే సీజ్ చేయడంతో పాటు మారక ద్రవ్యాలు వినియోగం కంటబడితే ఉపేక్షించేది లేదని కేసులు నమోదు చేస్తామన్నారు నిబంధనలు ఎవరు అతిక్రమించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.