బయ్యారం, డిసెంబర్ 30(పి సి డబ్ల్యూ న్యూస్):మండలానికి చెందిన క్రిస్టియన్ పాస్టర్లు సోమవారం మహబూబాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి భూక్య ప్రవీణ్ నాయక్ ఆధ్వర్యంలో తహసిల్దార్ కి బరియల్ గ్రౌండ్ స్థలాన్ని కేటాయించాలని వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలో సుమారుగా 3000 మంది క్రిస్టియన్స్ ఉన్నారని, వారు చనిపోయిన తర్వాత దాహాన సంస్కరణ కొరకు చాలా ఇబ్బందులు పడుతున్నామని కాబట్టి బరియల్ గ్రౌండ్ కేటాయించాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో మధుకర్ రాజు,పాస్టర్ పాండు, పాస్టర్ నోమేశ్వర్,పాస్టర్ రవిబాబు,పాస్టర్ యోహాను, బయ్యారం మండలం పాస్టర్స్ ఫెలోషిప్ తదితరులు ఉన్నారు.