Friday, April 4, 2025

సీఎం కప్ మండల స్థాయి క్రీడా పోటీలు.

-బిసి సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులకు పండ్లు పంపిణీ చేసిన జిల్లా, మండల నాయకులు.

సంగెం, డిసెంబర్ 12 ( పి సి డబ్ల్యూ న్యూస్):గ్రామీణ స్థాయిలో క్రీడాకారుల్లో ఉన్న ప్రతిభను వెలికితీసేందుకే సీఎం కప్‌-2024 మండల స్థాయి టోర్నమెంట్‌ నిర్వహిస్తున్నట్లు బిసి సంఘం నాయకులు అన్నారు.గురువారం రోజు సంగెం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణంలో ఏర్పాటు చేసిన సీఎం కప్ ముగింపు కార్యక్రమంలో ఆటల్లో పాల్గొన్న విద్యార్థినీ, విద్యార్థులకు పండ్లు పంపిణీ కార్యక్రమంలో భాగంగా ముఖ్య అతిథిలుగా విచ్చేసిన బిసి బహుజన సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ అల్లేపు శ్యామ్ సుందర్,బిసి సంక్షేమ సంఘం సంగెం మండల అధ్యక్షులు వేల్పుల అనిల్ యాదవ్ తో కలిసి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కడిదెలా కట్టస్వామీ యాదవ్ మందాటి లక్ష్మారెడ్డి ఏఐసిసి ఎన్రోలార్ శ్రీనివాస్ యాదవ్, పండ్లు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర, జాతీయ స్థాయిలో క్రీడాకారులను తీర్చిదిద్దాలన్న సంకల్పంతో ప్రభుత్వం సీఎం కప్ క్రీడా పోటీలను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తోందన్నారు. స్వతహాగా ఫుట్బాల్ క్రీడాకారుడైన సీఎం రేవంత్రెడ్డి క్రీడలను, క్రీడాకారుల ను ప్రోత్సహించడంలో భాగంగా రాష్ట్రంలో క్రీడా యూని వర్సిటీని సైతం ఏర్పాటు చేయబోతున్నారన్నారు. గత ప్రభుత్వం క్రీడలను పూర్తిగా విస్మరించిందన్నారు. క్రీడల కు, క్రీడాకారులకు నిలయమైన సుల్తానాబాద్లో ఎంతో మంది క్రీడల ద్వారా ఉద్యోగ అవశాశాలు పొందారన్నారు.గ్రామీణ ప్రాంతానికి చెందిన క్రీడాకారులలొ ఉన్న ప్రతిభను వెలికితీసేందుకే సీఎం కప్‌ టోర్నమెంట్‌ నిర్వహిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి రెవంత్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ

కార్యక్రమంలో సంగెం గ్రామ మాజీ సర్పంచ్ గుండేటి ఎల్లయ్య,సంగెం మండల కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షులు మెట్టుపల్లి ఏలీయా,17వ డివిజన్ కాంటెస్టేడ్ కార్పొరేటర్ కడిదెలా రామరావు యాదవ్,సంపత్,ఇంచార్జి ప్రధానోపాధ్యాయులు విక్రమ్,పీ.డి.శ్రీధర్,ముఖర్జీ,రతన్ సింగ్,శ్రీనివాస్,రవీందర్,శిరీష,పద్మ,రాజు,కొమురయ్య,ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Stay Connected

87,567FansLike
85,687FollowersFollow
66,686SubscribersSubscribe

Latest Articles