తెలంగాణలో పలుచోట్ల భూ ప్రకంపనలు.
–వరంగల్, హనుమకొండ, కరీంనగర్ జిల్లాలతో పాటు పలు జిల్లాల్లో భూ ప్రకంపనలు.
–రెండు సెకండ్ల పాటు కంపించిన భూమి… భయంతో ఇండ్ల నుండి బయటకు వచ్చిన ప్రజలు.
వరంగల్ జిల్లా : డిసెంబర్ 04 (పి సి డబ్ల్యూ న్యూస్ )
గత 20 సంవత్సరల తరవాత బలమైన భూకంపం 5.3 ఈ రోజు తెలంగాణ లో కనిపించింది. ములుగు జిల్లా మేడారం అడవుల్లో… గోదావరి నది పరివాహక ప్రాంతాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాలలో పలుచోట్ల భూప్రకంపనలు కనిపించాయి. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, తెలుగు రాష్ట్రాలలో పలుచోట్ల స్వల్ప భూప్రకంపనలు వచ్చాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం, మణుగూరు, భద్రాచలం,చర్ల, చింతకాని, నాగులవంచ మండలాల్లోస్వల్పంగా భూమి కంపించింది. ఆంధ్రాలోని విజయవాడ జగ్గయ్యపేట పట్టణాల్లో స్వల్పభూప్రకంపనలు జరిగాయి. కరీంనగర్ జిల్లాలో హుజూరాబాద్, జమ్మికుంట, వీణవంక ఇల్లందకుంట, మొగుళ్ళపల్లి, రేగొండ ఏరియాలో స్వల్ప భూకంపం కనిపించింది. జమ్మికుంటలో ఈరోజు ఉదయం 7:25 ని. సమయంలో భూమి కదిలినట్టు అనిపించడంతో ఇంట్లో ఉండి భయభ్రాంతులతో బయటికి వచ్చిన ప్రజలు.అలాగే కమలాపూర్ తో పాటు పలు గ్రామాల్లో కొద్ది నిమిషాల ముందు స్వల్ప భూకంప ప్రకంపనలు చోటు చేసుకున్నట్లు ఆయా గ్రామాల ప్రజలు పేర్కొన్నారు.