PCW News

Breaking
ప్రభుత్వ అసైన్డ్ భూముల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని అడ్డుకోవాలి రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి, మరొకరు తీవ్రగాయలు హాస్టళ్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్. కాంగ్రెస్ ఏడాది ప్రజాపాలనపై సబ్బండ వర్గాలు సంతోషంగా ఉన్నారు.. పురుగుల మందు తాగి వ్యక్తి మృతి *ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి*. రామడుగు పోలీస్ స్టేషన్ ను సందర్శించిన కరీంనగర్ పోలీస్ కమీషనర్ జర్నలిస్టులకు మొండి చేయి చూపిన కాంగ్రెస్ ప్రభుత్వం -నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ అప్రజాస్వామికం -మాలమహానాడు జిల్లా కార్యదర్శి కూనమళ్ళ కమలాకర్ జీడీఎస్‌ల స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాలి..

ప్రభుత్వ అసైన్డ్ భూముల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని అడ్డుకోవాలి

నర్సంపేట, నవంబర్ 27(పీసీడబ్ల్యూ న్యూస్): ప్రభుత్వ అసైన్డ్ భూముల్లో చట్ట విరుద్ధంగా క్రయవిక్రయాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోని అట్టి భూములను కాపాడాలని అలాగే అర్హులైన పేదల స్వాధీనంలో ఉన్న ప్రభుత్వ భూములకు పట్టాలు ఇవ్వాలని ఎంసిపిఐ(యు) జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్ డిమాండ్ చేశారు.ఈ మేరకు నర్సంపేట పట్టణ శివారు మాదన్నపేట రోడ్డు ఆనుకుని ఉన్న సర్వేనెంబర్ 111 ప్రభుత్వ అసైన్డ్ భూమిలో మట్టి పోసి చదును చేస్తున్న ప్రాంతాన్ని ఆయన నేతృత్వంలోని ఎంసిపిఐ(యు) బృందం పరిశీలించారు. అనంతరం స్థానిక ఆర్డిఓ ఉమాదేవి కి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా పెద్దారపు రమేష్ మాట్లాడుతూ ఒకవైపు నిలువ నీడలేని పేదల సంఖ్య పెరిగిపోతుంటే వారికి చెందాల్సిన ప్రభుత్వ స్థలాలు అనర్హులు ఆక్రమించుకొని ఏదేచ్ఛగా రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరుతో మధ్య తరగతి ప్రజలను నమ్మించి కోట్లు దండుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పేదలు నివాసం ఉండడానికి గుడిసెలు వేసుకుంటే మాత్రం కేసులు పెట్టి భయభ్రాంతులకు గురిచేస్తారని ఇదెక్కడి అన్యాయమని ప్రశ్నించారు. ‌ సర్వేనెంబర్ 111 లోని ప్రభుత్వ అసైన్డ్ భూమిలో క్రయవిక్రయాలకు పాల్పడితే చట్టరీత్యా చర్యలు తీసుకొని పిఓపి ఆక్ట్ అమలు చేసి ప్రభుత్వం భూమిని స్వాధీన పరుచుకుని అర్హులైన పేదలకు పంచాలని, ఈ క్రమంలో చట్ట విరుద్ధంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న వ్యక్తులపై చర్యలు చేపట్టాలని ఇప్పటికే పేదల స్వాధీనంలో ఉన్న ప్రభుత్వ భూములకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ భూముల రక్షణకు అధికార యంత్రాంగం పూనుకోకపోతే పేదలే అట్టి భూముల రక్షణకు సమాయత్తం అవుతారని అన్నారు. తక్షణమే ప్రభుత్వ అసైన్డ్ భూమిలో రాత్రి వేళల్లో మట్టి పోసి చదును చేస్తున్న వారిపై చర్యలు తీసుకొని అట్టి భూమిని కాపాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంసిపిఐ(యు) డివిజన్ సహాయ కార్యదర్శి కొత్తకొండ రాజమౌళి రాష్ట్ర కమిటీ సభ్యులు వంగల రాగసుధ ఏఐసిటియు జిల్లా అధ్యక్షుడు ఎండి మాశూక్ స్థానిక కార్యకర్తలు జన్ను జమున భైరబోయిన నరసయ్య ముప్పారపు రాజు మహమ్మద్ రెహమాన్ ఎండి ఆసిఫ్ నకిన బోయిన భవాని బిందు మన్నెమ్మ కోమల షబానా తదితరులు పాల్గొన్నారు.