PCW News

Breaking
కాంగ్రెస్ ఏడాది ప్రజాపాలనపై సబ్బండ వర్గాలు సంతోషంగా ఉన్నారు.. పురుగుల మందు తాగి వ్యక్తి మృతి *ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి*. రామడుగు పోలీస్ స్టేషన్ ను సందర్శించిన కరీంనగర్ పోలీస్ కమీషనర్ జర్నలిస్టులకు మొండి చేయి చూపిన కాంగ్రెస్ ప్రభుత్వం -నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ అప్రజాస్వామికం -మాలమహానాడు జిల్లా కార్యదర్శి కూనమళ్ళ కమలాకర్ జీడీఎస్‌ల స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాలి.. ప్రతి మహిళా సాధికారతే ప్రభుత్వ లక్ష్యం.. ఆనందోత్సాహాల నడుమ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.. భూ కబ్జాదారుల నుండి 41 ఏళ్ల సమస్య..

కాంగ్రెస్ ఏడాది ప్రజాపాలనపై సబ్బండ వర్గాలు సంతోషంగా ఉన్నారు..

బీఆర్ఎస్ పార్టీ ధృతరాష్ట్ర, అవినీతి, అక్రమ పాలన అంతమొందించి, కాంగ్రెస్ ప్రజా పాలన ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా కాంగ్రెస్ ప్రజా పాలనతో తెలంగాణ రాష్ట్రంలోని సబ్బండ వర్గాలు సంతోషంగా ఉన్నారని రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు తమకు అందుతున్నాయన్న సంతోషాన్ని ప్రజలు వ్యక్తం చేస్తున్నారని శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్, నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు. నగరంలోని 51వ డివిజన్ లోని మార్కెట్ రోడ్ శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి వద్ద నగర కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి సర్దార్ ధన్నా సింగ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలన ఏర్పడి ఏడాది కావస్తున్న సందర్భంగా సంబరాలకు ముఖ్య అతిథిగా నరేందర్ రెడ్డి హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు ప్రజలతో మమేకమై ఈ సంబరాల్లో పాల్గొనడం అభినందనీయమన్నారు. 500 కు గ్యాస్ సిలిండర్ వస్తుందా, బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేస్తున్నారా, 200 యూనిట్ల లోపు వినియోగించుకున్న లబ్ధిదారులకు గృహ జ్యోతి వస్తుందా, కులగణన సక్రమంగా జరుగుతుందా అని ప్రజలను తాము అడిగితే.. సంతోషం వ్యక్తం చేస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ తాము తమకు సకాలంలో అందుతున్నాయని, ఆనందంగా చెప్పడంపై రాష్ట్ర ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని, ఇచ్చిన మాటకు కట్టుబడి హామీలను అమలు చేస్తున్న ఘనత కాంగ్రెస్ పార్టీదన్నారు. గతంలో రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్ పార్టీ పాపాలు తెలంగాణ ప్రజలకు శాపాలుగా మారాయని ఆరోపించారు. బిఆర్ఎస్ పార్టీ చేసిన పాపాలను కడుగుతూ ప్రజలకు ఆమోదయోగ్యమైన ప్రజాపాలనను రేవంత్ రెడ్డి ప్రభుత్వం అందిస్తుందన్నారు. నగరవ్యాప్తంగా కలియతిరిగి ప్రజలను కలుస్తూ.. వారికి అందుతున్న సంక్షేమ పథకాలపై ఆరా తీసి రాబోయే 15 రోజులపాటు సంబరాలను నిర్వహిస్తామన్నారు. తాము వెళ్లిన చోటల్లా ప్రజల నుంచి విశేష స్పందన వస్తుందని, స్వచ్ఛందంగా ప్రజలు సంబరాలు పాల్గొంటున్నారని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు తమకు బేషూగ్గా అందుతున్నాయని, ప్రజా పాలనను అందిస్తున్న కాంగ్రెస్ పార్టీ రాబోయే 20 సంవత్సరాల పాటు అధికారంలో ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో గుండటి శ్రీనివాస్ రెడ్డి, శ్రవణ్ నాయక్,రాజా గౌడ్, పోరండ్ల రమేష్,తమ్మిడి ఏజ్రా, మాసూమ్ ఖాన్,బషీర్, సత్యనారాయణ రెడ్డి, కిరణ్ రెడ్డి ,ఖలీల్,భారీ, కీర్తి కుమార్,రజిత రెడ్డి, ముల్కలా కవిత, ఊరడి లత,జ్యోతి రెడ్డి,షబానా ముహమ్మద్.