నర్సంపేట, నవంబర్ 12 (పిసి డబ్ల్యూ న్యూస్): నర్సంపేట మాజీ శాసన సభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి నర్సంపేట బిఆర్ఎస్ కార్యాలయం నుండి మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ ,మళ్లీ గెలిస్తేనె జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు అని చెప్పిన రేవంత్ సర్కార్. కెసిఆర్ కేటాయించిన ఇండ్ల స్థలాలనే,ఇప్పుడున్న ప్రభుత్వం జర్నలిస్టులకు ఇచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇండ్ల స్థలాల కోసం ఎదురుచూసిన జర్నలిస్టులకు నిరాశే మిగిలింది.రెండో విడత ఇండ్ల స్థలాలను రెండవసారి అధికారంలోకి వస్తేనే ఇస్తాం అని చెప్పడం జర్నలిస్టులను మోసం చేయడమే.నర్సంపేటలో జర్నలిస్టులకు కేటాయించిన ఇండ్ల స్థలాలను ఇప్పటికీ వారికి ఇవ్వకపోవడం విడ్డూరం. బిఆర్ఎస్ ప్రభుత్వంలో నర్సంపేట నియోజకవర్గంలో మున్సిపాలిటీతో పాటు అన్ని మండలలలో పనిచేస్తున్న జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలను కేటాయించడం జరిగింది.ఇండ్లనిర్మాణాలకోసం 7 కొట్లా50 లక్షల నిధులతో టెండర్ల ప్రక్రియ కూడా పూర్తి చేసిన జి ఓ , అగ్రిమెంట్ దశలో ఆపింది ఎవరు.జర్నలిస్టులో ప్రజలకు ప్రభుత్వాలకు రాజకీయ పార్టీలకు వారధిగా పనిచేస్తారు వారి పట్ల రాజకీయ కక్ష చూపడం తగదు.నర్సంపేటలో కూడా జర్నలిస్టులకు రెండవసారి గెలిచిన తర్వాతనే ఇళ్ల స్థలాలు ఇస్తారా. నియోజకవర్గంలో జర్నలిస్టలకోసం కేటాయించిన ఇండ్ల స్థలాలు తక్షణమే ఇవ్వాలి.కాంగ్రెస్ ప్రభుత్వం జర్నలిస్టులతో సహా అన్ని వర్గాలను మోసం చేసింది.జర్నలిస్టుల కు కేటాయించిన స్థలాలు కలెక్టర్ ప్రోసిడింగ్స్ కాపీ వివరాలు నర్సంపేట 430/2017.నర్సంపేట సర్వపురం నల్లబెల్లి .352/2,3 ,0.19&1.36,ఖానాపూర్ బుధరావుపేట .865,3/1/2
.o.15&0.415,దుగ్గొండి :334,35,36,37&38 1.06 చేన్నరావుపేట,356 ,0.25 పూర్తి వివరాలు తో ఒక ప్రకటనలో తెలిపారు.