నర్సంపేట, నవంబర్ 12 (పీసీడబ్ల్యూ న్యూస్): వరంగల్ జిల్లా నర్సంపేట డివిజన్ కేంద్రంలోని మాలమహానాడు ముఖ్యకార్యకర్తల సమావేశం నర్సంపేట మండల అధ్యక్షులు అశోద నర్సింగం అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ యొక్క సమావేశానికి మాలమహానాడు జిల్లా కార్యదర్శి కూనమళ్ళ కమలాకర్ ముఖ్య అతిధిగ హాజరై మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే దళిత బంద్ 10 లక్షలు కాదు 12 లక్షలు ఇస్తాము అని చెప్పిన ఈ ప్రభుత్వం దళిత బంధు అడుగుతున్న దళితులను దళిత బందుకు మద్దతు తెలిపిన ఎమ్మెల్యే హుజురాబాద్ కౌశిక్ రెడ్డిని అరెస్టు చేయడం దౌర్జన్యంగా అతనిపై దాడి చేయడం ఎంతవరకు మంచిది కాదని చెప్పడం జరిగింది.దళితుల పట్ల చిన్నచూపు చూస్తున్న ఈ ప్రభుత్వానికి త్వరలోనే బుద్ధి చెప్తామని దళితుల ఓట్లతో గెలిచిన ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే రెండవ విడత దళిత బంద్ పది లక్షల రూపాయల ఇచ్చి దళితుల పట్ల వారి యొక్క చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని కోరడం జరిగింది.ఈ యొక్క కార్యక్రమంలో మాల మహానాడు ఉపాధ్యక్షుడు పోతరాజు నరసయ్య చెన్నారావుపేట మండల అధ్యక్షుడు కడగండ్ల యాకయ్య కోతి విష్ణు తదితరులు పాల్గొన్నారు.