Thursday, April 3, 2025

ప్రతి మహిళా సాధికారతే ప్రభుత్వ లక్ష్యం..

కాజీపేట మండల లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి/షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ

-63వ డివిజన్ కార్పొరేటర్ విజయశ్రీ -సయ్యద్ రజాలి

హనుమకొండ ప్రతినిధి: అక్టోబర్ 7(నేటితరం) ప్రభుత్వం చేపట్టే ప్రతి సంక్షేమం మహిళలకు నేరుగా అందాలనే లక్ష్య దిశగా, ఫ్యామిలీ డిజిటల్ కార్డులో గృహ యజమానురాలుగా కార్డులు అందివ్వబోతుందని, మహిళా సాధికారతే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని 63 డివిజన్ కార్పొరేటర్ విజయ శ్రీ -సయ్యద్ రజాలి అన్నారు. సోమవారం కాజీపేట మండలాల లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ/ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి, కార్పొరేటర్ విజయ శ్రీ- రజాలి పాల్గొని. కాజీపేట మండల లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి/ షాదీ ముబారక్ చెక్కుల తో పాటు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు. అనంతరం కార్పొరేటర్ మాట్లాడుతూ.. గతంలో ఏ ప్రభుత్వం చేయలేని విధంగా ప్రజల సంక్షేమమే ధ్యేయంగా, కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందన్నారు. ఈ బతుకమ్మ, విజయదశమి పర్వదినాన వారి జీవితాల్లో సంతోషం నింపడం కోసం పండుగ ముందరే చెక్కులు వారికి అందజేయడం జరిగిందన్నారు. ఈ విజయదశమి అందరి జీవితాల్లో వెలుగులు నిండాలని కార్పొరేటర్ విజయ శ్రీ- రజాలి ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో లబ్ధిదారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Stay Connected

87,567FansLike
85,687FollowersFollow
66,686SubscribersSubscribe

Latest Articles