సంగెం/ (పి సి డబ్ల్యూ న్యూస్ ) సంగెం మండలం మొండ్రాయి గ్రామంలో ఉన్న జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో 2006-2007 పదవ తరగతికి చెందిన 78 మంది పూర్వ విద్యార్థినీ, విద్యార్థులు ఆరుగురు ఉపాధ్యాయులతో కలిసి ఆత్మీయ సమ్మే ళనం ఆదివారం రోజు ఉదయం పాఠశాలలో ఏర్పాటు చేశారు. పూర్వ విద్యార్థులు ఒకరినొకరు ఆత్మీయ పలకరింపులు, ఆలింగనాల నడుమ నాటి మధుర స్మృతులను నెమరేసుకున్నారు. సరిగ్గా 18 సంవత్సరాల తరువాత వారంతా ఒక చోట చేరి నాటి జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ ఎంజాయ్ చేశారు. నాటి స్నేహితులను కలుసుకోవడంతో వారి ఆనందానికి అవధులు లేవు, యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థి దశలో చిలిపి చేష్టలు మరువలేనివని, ఆనాడు విద్యా బుద్ధులు నేర్పిన గురువులు కృష్ణమూర్తి, లీనా, విజయ్ కుమార్, వెంకటేశ్వర్లు, కుమారస్వామి,అనిత, ఆనాటి జ్ఞాపకాలను విద్యార్థులకు గుర్తు చేశారు. నాటి ఉపాధ్యాయులను శాలువతో ఘనంగా సత్కరించి నమస్కరిస్తూ గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మైశ్రీ గురవే నమః అని గురువుల పాదాలు తాకి ఆశీస్సులు స్వీకరించారు.సుమారు 78 మంది పూర్వ విద్యార్థులందరూ ఒకేచోట చేరవడంతో సందడి నెలకొని ముఖాల్లో వెలుగులు నిండాయి. ఈ ఆత్మీయ సమ్మేళనంలో విద్యార్థులు వారి యొక్క అనుభవాలను ప్రస్తుతం వాళ్లు చేస్తున్న వృత్తి కుటుంబ సభ్యుల గురించి చెప్పుతూ కన్నీటి పర్యంతం అయ్యారు, కొందరు విద్యార్థులు భావోద్వేగానికి గురి అయ్యారు. పాఠశాల ఆవరణ మొత్తం పండగ వాతావరణం గా మారింది. గురువులు కూడా మాకు ఎంతో ఓపికతో సహనంతో మేము చేసే అల్లరిని భరిస్తూ మాకు జీవితం పట్ల సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతలు సాధించాలని ఇంకా ఉన్నత స్థానాలకు ఎదగాలని వారు మమ్మల్నందర్నీ దీవించడం జరిగింది. సాయంత్రం వరకు తోటి విద్యార్థుల పిల్లలతో ఆటపాటలతో గడిపారు. ఇక నుంచి టచ్లో ఉండాలంటూ ఒకరినొకరు ఫోన్ నంబర్లు తీసుకోవడంతో పాటు మధుర జ్ఞాపకాలను తమ సెల్ఫోన్లలో బంధించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు,పూర్వ విద్యార్థి ని, విద్యార్థులు చిన్నారులు తదితరులు పాల్గొన్నారు.